అన్ని కోర్టులూ ఒకేచోట
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:26 AM
మేడ్చల్‌లోని కోర్టులన్నీ ఒకేచోట ఏర్పాటుచేసేందుకు అదనంగా భవనాన్ని నిర్మిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ షావలి తెలిపారు. రూ.90లక్షల నిధులతో మేడ్చల్ కోర్టు ఆవరణలో నిర్మిస్తున్న భవన నిర్మాణపు పనులకు ఆయన శనివారం శంకు స్థాపన చేశారు.

హైకోర్టు జడ్జి అభినందన్ కుమార్ షావలి
మేడ్చల్ కోర్టు ఆవరణలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
మేడ్చల్ టౌన్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌లోని కోర్టులన్నీ ఒకేచోట ఏర్పాటుచేసేందుకు అదనంగా భవనాన్ని నిర్మిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ షావలి తెలిపారు. రూ.90లక్షల నిధులతో మేడ్చల్ కోర్టు ఆవరణలో నిర్మిస్తున్న భవన నిర్మాణపు పనులకు ఆయన శనివారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల కోర్టులు ఒకే ప్రాంగణంలో ఉంటే.. న్యాయవాదులకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అత్వెల్లిలో నిర్వహిస్తున్న రెండు కోర్టులను మేడ్చల్ పట్టణంలోని ఇతర కోర్టుల ప్రాంగణంలోకి తీసుకురావటానికి నూతన భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయాధి కారి బాలభాస్కర్‌రావు, సెకండ్ డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టు న్యాయాధికారి జీవన్ కుమార్, అడిషనల్ సీనియర్ న్యాయాధికారి అజయ్‌కుమార్, ఫస్ట్ జూనియర్ న్యాయాధికారి లావణ్య, సెకండ్ జూనియర్ న్యాయాధికారి దిలీ్‌పకుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి హేమలత, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఏసీపీ శ్రీనివా్‌సరెడ్డి, తదితరులున్నారు.