Share News

ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ‘ఆర్‌ఆర్‌యూ’ అపహరణ

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:07 AM

ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ఆర్‌ఆర్‌ (రిమోట్‌ రేడియో యూనిట్‌)ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన సోమవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ‘ఆర్‌ఆర్‌యూ’ అపహరణ

చేవెళ్ల, మార్చి 26 : ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ఆర్‌ఆర్‌ (రిమోట్‌ రేడియో యూనిట్‌)ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన సోమవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దగోల్కొండ ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ఆర్‌ఆర్‌యూను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సెల్‌టవర్‌ ఎక్కి అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్‌టెల్‌ అధికారులు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు. ఆర్‌ఆర్‌యూ విలువ దాదాపు రూ.2లక్షల ఉంటుందని చెప్పారు. తెలిసినవారే ఆర్‌ఆర్‌యూను దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:07 AM