Share News

కేంద్ర చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్ల ఆందోళన

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:15 AM

రోడ్డు ప్రమాదాల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లారీ డ్రైవర్లు బుధవారం తుంకిమెట్లలో హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ నంబర్‌ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. డ్రైవర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్ల ఆందోళన
తుంకిమెట్లలో హైవేపై ధర్నా చేస్తున్న లారీ డ్రైవర్లు

బొంరా్‌సపేట్‌/కీసర/శామీర్‌పేట, జనవరి 10: రోడ్డు ప్రమాదాల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లారీ డ్రైవర్లు బుధవారం తుంకిమెట్లలో హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ నంబర్‌ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. డ్రైవర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొత్త చట్టాలతో తమ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. లారీల యాజమాన్యాలకు సంబంధం లేకుండా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్లదే బాధ్యత అని కొత్త చట్టంలో ఉందని, దీనికి రూ.7లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు చట్టంలో నిబంధన విధించారన్నారు. ఈ చట్టం అమలైతే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రద్దు చేయాలన్నారు. వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద లారీ డ్రైవర్లు ధర్నా చేశారు. తమపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు వచ్చి లారీ డ్రైవర్లకు నచజెప్పి ధర్నాను విరమింపచేశారు. హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని రద్దు చేసి డ్రైవర్లను ఆదుకోవాలని శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌ చౌరస్తా వద్ద వాహనాల డ్రైవర్లు ఆందోళన చేశారు. కార్యక్రమంలో డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షుడు శ్రీపతి నగేష్‌, శ్రీపతి ఉప్పలయ్య, నరసింహ, రవి, సత్యనారాయణ, డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:15 AM