‘డైట్’లో అడ్మిషన్లు షురూ
ABN , Publish Date - Aug 02 , 2024 | 12:33 AM
డైట్ కళాశాలలో అడ్మిషన్లకు ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని డైట్ ప్రిన్సిపాల్ రామచారి తెలిపారు.
వికారాబాద్, ఆగస్టు 1: డైట్ కళాశాలలో అడ్మిషన్లకు ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని డైట్ ప్రిన్సిపాల్ రామచారి తెలిపారు. గురువారం వికారాబాద్ డైట్ కళాశాలలో అడ్మిషన్లకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. మొదటి రోజు 400మంది హాజరుకావాల్సి ఉండగా 220 మంది వచ్చారు. వారిలో తెలుగు మీడియంలో 203, ఇంగ్లీష్ మీడియంలో 14, ఉర్ధూ మీడియంలో ముగ్గురు ఉన్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల ఆరోతేదీ వరకు మొత్తం 1,560మంది సర్టిపికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాలేని వారికి మరో రోజు అవకాశం ఇస్తామని, గురువారం రాని వారు శుక్రవారం హాజరుకావొచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.