Share News

అదనపు బస్సులు నడిపించాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:47 PM

పరిగి నుంచి కిష్టాపూర్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరుతూ పాఠశాల, కళాశాల విద్యార్థులు మంగళవారం గడిసింగాపూర్‌ దగ్గర రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు.

అదనపు బస్సులు నడిపించాలి
ధర్నా చేస్తున్న విద్యార్థులు

పరిగి, సెప్టెంబరు 10: పరిగి నుంచి కిష్టాపూర్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరుతూ పాఠశాల, కళాశాల విద్యార్థులు మంగళవారం గడిసింగాపూర్‌ దగ్గర రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. విద్యార్థుల సమయపాలనకు అనుగుణంగా బస్సులు నడిపించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. పరిగి, గడిసింగాపూర్‌ మీదుగా కిష్టాపూర్‌కు సరిగ్గా బస్సులులేవని వాపోయారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడతామని విద్యార్థులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.

Updated Date - Sep 10 , 2024 | 11:47 PM