Share News

కంకర వేసి.. తారు మరిచి

ABN , Publish Date - May 17 , 2024 | 12:46 AM

బషీరాబాద్‌- తాండూరు ప్రధాన మార్గం అగ్గనూరు సమీపంలో డబుల్‌ రోడ్డు కొంత మేరకు పూర్తిగా దెబ్బతినడంతో ఆరు నెలల కిందట తొలగించారు.

కంకర వేసి.. తారు మరిచి
బషీరాబాద్‌-తాండూరు మార్గంలో అగ్గనూరు వద్ద కంకర తేలిన రోడ్డు

  • ఆరు నెలలుగా ప్రయాణికులకు తప్పని తిప్పలు

  • పట్టించుకోని సంబంధిత అధికారులు

బషీరాబాద్‌, మే 16: బషీరాబాద్‌- తాండూరు ప్రధాన మార్గం అగ్గనూరు సమీపంలో డబుల్‌ రోడ్డు కొంత మేరకు పూర్తిగా దెబ్బతినడంతో ఆరు నెలల కిందట తొలగించారు. ఈ రోడ్డును కొత్తగా వేసేందుకు కిలోమీటరు మేర మధ్య మధ్యలో బీటీ రోడ్డును కాంట్రాక్టర్‌ తొలగించి కంకర పరిచే పనులు చేపట్టారు. ఈ కంకర వేసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడంలేదు. ఈ మార్గంలో పరిచిన కంకరతో ముందు వెళ్తున్న వాహనాలతో దుమ్ములేచి దిచక్రవాహనదారులపై పడి ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఉవ్వెత్తున వెలువడే కంకర దుమ్ముతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనాదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:46 AM