గుడి గంటల అపహరణ కేసులో నిందితుడి రిమాండ్
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:22 AM
మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, ముత్యాలమ్మ, ఈదమ్మ ఆలయాల్ల్లో గంటలు అపహరించిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
యాచారం, జూలై 30 : మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, ముత్యాలమ్మ, ఈదమ్మ ఆలయాల్ల్లో గంటలు అపహరించిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. మండల కేంద్రంలోని ముత్యాలమ్మ, వేంకటేశ్వరస్వామి, ఈదమ్మ ఆలయాల్లో ఇటీవల రూ.40వేల విలువైన గంటలు చోరీ అయ్యాయి. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలిస్తుండగా సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన దుర్గాప్రసాద్ పోలీసులకు చిక్కాడు. ఇటీవల మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో, ముత్యాలమ్మ, ఈదమ్మ అమ్మవారి ఆలయాల్లో గంటలు చోరీ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. క్రైం పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం ఉదయం గున్‌గల్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దుర్గాప్రసాద్ అనుమానాస్పందంగా తిరుగుతుండగా పెట్రోమొబైల్-1 పోలీసులకు అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించడంతో నేరం అంగీకరించాడు. నల్గొండ జిల్లా మర్రిగూడ స్టేషన్‌లో పలుచోరీ కేసులు అతడిపై ఉన్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని రత్నానగర్‌లో, ఇబ్రహీంపట్నంలో ఇళ్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నట్లు నిందితుడు చెప్పాడు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను మంగళవారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ శంకర్‌కుమార్ తెలిపారు.