చోరీ కేసులో నిందితుడికి ఆరునెలల జైలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:36 PM
బైక్ చోరీ కేసులో నిందితుడికి గజ్వేల్ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బి.ప్రియాంక తీర్పును వెలువరించినట్లు గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ బి.సైదా తెలిపారు.

గజ్వేల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బైక్ చోరీ కేసులో నిందితుడికి గజ్వేల్ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బి.ప్రియాంక తీర్పును వెలువరించినట్లు గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ బి.సైదా తెలిపారు. మూడు నెలల కిందట జరిగిన బైక్ చోరీ కేసులో మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం సూర్యనగర్‌కాలనీకి చెందిన శంకర్‌సింగ్(25) అరె్‌స్టచేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నేరం రుజువైనందున నేరస్తుడికి ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించినట్లు ఇన్‌స్పెక్టర్ సైదా వెల్లడించారు. నిందితుడికి శిక్షపడటంలో కృషి చేసిన అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ శంకర్, ఏఎ్‌సఐ గోపాల్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్ సైదా, కోర్టు కానిస్టేబుల్ కుమార్‌లను సిద్దిపేట పోలీ్‌సకమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించడంతో పాటు రివార్డును అందజేయనున్నట్లు తెలిపారు.