Share News

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:08 AM

మైనర్‌పై లైంగికదాడి కేసులో మండలంలోని రాంనుంతల పెద్దతండాకు చెందిన బాణావత్‌ అరుణ్‌కుమార్‌కు సైదాబాద్‌ జువైనల్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.4వేలు జరిమాన విధించినట్లు ఆమనగల్లు ఎస్సై బాల్‌రామ్‌ నాయక్‌ తెలిపారు.

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు

ఆమనగల్లు, ఏప్రిల్‌ 18 : మైనర్‌పై లైంగికదాడి కేసులో మండలంలోని రాంనుంతల పెద్దతండాకు చెందిన బాణావత్‌ అరుణ్‌కుమార్‌కు సైదాబాద్‌ జువైనల్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.4వేలు జరిమాన విధించినట్లు ఆమనగల్లు ఎస్సై బాల్‌రామ్‌ నాయక్‌ తెలిపారు. 2018లో బాలికపై అరుణ్‌కుమార్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఈమేరకు పూర్వాపరాలు పరిశీలించిన సైదాబాద్‌ జువైౖనల్‌ కోర్టు జడ్జి గురువారం ఏడాది జైలు, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:08 AM