Share News

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:35 PM

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సుదర్శన్‌ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌ 19: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సుదర్శన్‌ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2013లో కరన్‌కోట్‌ గ్రామానికి చెందిన వడ్డె శ్యామలమ్మ నివాసం ఉంటుంది. ఆమెకు వరుసకు తమ్ముడైన మంచిర్యాల లింగప్ప శ్యామలమ్మ వద్ద నుంచి తులం బంగారం, రూ.30వేల నగదును తీసుకున్నాడు. తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో శ్యామలమ్మ లింగప్పను బంగారం, నగదు ఇవ్వాలని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన లింగప్ప శ్యామలమ్మ ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై వడ్డె దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కరన్‌కోట్‌ ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. అప్పటి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీటు సమర్పించారు. వాదోపవాదాలు విన్న డిస్ట్రిక్ట్‌ జడ్జీ కె.సుదర్శన్‌ శుక్రవారం నిందితుడు లింగప్పకు జీవిత ఽఖైదుతోపాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 11:35 PM