Share News

‘నిలువు దోపిడీ’ కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:24 AM

నాలుగు రోజుల క్రితం మహిళను బెదిరించి నగలు, నగదు అపహరించుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

‘నిలువు దోపిడీ’ కేసులో నిందితుడి అరెస్టు

మంచాల, జనవరి 10 : నాలుగు రోజుల క్రితం మహిళను బెదిరించి నగలు, నగదు అపహరించుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సీఐ కాశీవిశ్వనాథ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా లింగంపేట మండలం, సంగారెడ్డిపేటకు చెందిన కొవ్వూరి లక్ష్మిని ఆటోడ్రైవర్‌ నమ్మించి ఎంజీబీఎస్‌ వద్ద తన ఆటోలో ఎక్కించుకుని మంచాల పోలీస్‌ పరిధి రంగాపూర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి బెదిరించాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌, రూ.5వేల నగదు అపహరించుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంచాల పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని జటావత్‌ మహే్‌షగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్‌, 29 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని చోరీకి వినియోగించిన ఆటోను సీజ్‌ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 12:24 AM