Share News

‘పట్నం’లో పన్నుల వసూళ్లు వేగవంతం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:52 PM

2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనుండగా.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు.

‘పట్నం’లో పన్నుల వసూళ్లు వేగవంతం

ఇప్పటి వరకు రూ.4.30 కోట్లు వసూలు

ఇబ్రహీంపట్నం, మార్చి 22 : 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనుండగా.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు. మొత్తం డిమాండ్‌ రూ.10.63 కోట్లు కాగా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా రూ.3.93 కోట్లు పోను.. రూ.6.70 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.4.30 కోట్లు వసూలు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ సాగర్‌ తెలిపారు. కొంత కాలంగా బకాయిలు పేరుకుపోయిన వ్యాపార సముదాయాలను సీజ్‌ చేశారు. బిల్‌ కలెక్టర్ల్లు, వార్డు అధికారులు మొత్తం 20 మంది పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారని, ఈ నెలాఖరులోపు పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 11:52 PM