Share News

ఆకుల మైలారంలో 40 గొర్రెల అపహరణ

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:06 AM

హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి ఆకులమైలారంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 40 గొర్రెలను అపహరించారు. గ్రామానికి చెందిన గొరిగె మల్లయ్య సాయంత్రం గొర్రెలను మందలో తోలి అన్నం తినడానికి ఇంటికి వచ్చాడు.

ఆకుల మైలారంలో 40 గొర్రెల అపహరణ

యాచారం, జూన్‌ 11 : హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి ఆకులమైలారంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 40 గొర్రెలను అపహరించారు. గ్రామానికి చెందిన గొరిగె మల్లయ్య సాయంత్రం గొర్రెలను మందలో తోలి అన్నం తినడానికి ఇంటికి వచ్చాడు. తర్వాత మంద వద్దకు వస్తుండగా మినీ ట్రక్కు వేగంగా వెళుతుండటం గమనించి భయంతో వెళ్లి చూడగా.. మంద నుంచి గొర్రెలు అపహరించారని గుర్తించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కొందరు యువకులతో కలిసి మందలోకి వెళ్లి చూడగా మొత్తం 40 గొర్రెలు ఎత్తుకెళ్లినట్లు మల్లయ్య వాపోయాడు. దొంగలు మంద వద్ద రెండు తాళ్లను వదిలిపోయారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీశైౖలం-హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారులపై వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు డివిజన్‌ పరిధి పోలీసులను అలర్ట్‌ చేసి మాల్‌, కొత్తగూడగేటు, ఆగాపల్లి, గున్‌గల్‌, బొంగులూర్‌ గేటు ప్రాంతాల్లో తనిఖీ ముమ్మరం చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 09:20 AM