Share News

రైలుకింద పడి యువకుడు మృతి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:01 AM

అనుమానాస్పద స్థితిలో రైలుకింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది.

రైలుకింద పడి యువకుడు మృతి

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 11: అనుమానాస్పద స్థితిలో రైలుకింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామ జైతురాం తండాకు చెందిన మలావత్‌ అనీల్‌ అనే యుకుడు మంగళవారం రాత్రి తన ఇంట్లో గొడవ పడి ఇంటి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారుజామున డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలోని రైలుపట్టాల వద్ద గుర్తు పట్టని విధంగా శవమై కనిపించాడు. దీంతో స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు శవపరీక్ష నిర్వహించి మృతుడు మలావత్‌ అనీల్‌గా నిర్ధారించారు. మృతదేహాన్ని గురువారం కుంటుంబసభ్యులకు అప్పగిం చారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:01 AM