Share News

కొబ్బరిచెట్టు పైనుంచి పడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:55 PM

కొబ్బరిబోండాలు తెంపేందుకు చెట్టెక్కిన యువకుడు ప్రమాదవశాత్తు పడిపోడగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

కొబ్బరిచెట్టు పైనుంచి పడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

బషీరాబాద్‌, మార్చి 4: కొబ్బరిబోండాలు తెంపేందుకు చెట్టెక్కిన యువకుడు ప్రమాదవశాత్తు పడిపోడగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మంలంలోని కాశీంపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోగి దత్తాత్రేయ(23) శనివారం ఓ ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కొబ్బరి బోండాలను కోసేందుకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. దత్తాత్రేయ చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ దత్తాత్రేయ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 11:55 PM