Share News

తల్లితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:38 AM

కల్యాణం చేసుకొని ఆరుకాలాలు జీవించాలని భావించిన భర్తకు.. భార్య, అత్తలు యమపాశంగా మారారు. తల్లితో కలిసి భార్య తన భర్తను కడతేర్చిన విషాద ఘటన మండలంలోని కొత్తగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు..

తల్లితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

కందుకూరు, జూలై 4: కల్యాణం చేసుకొని ఆరుకాలాలు జీవించాలని భావించిన భర్తకు.. భార్య, అత్తలు యమపాశంగా మారారు. తల్లితో కలిసి భార్య తన భర్తను కడతేర్చిన విషాద ఘటన మండలంలోని కొత్తగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. కొత్తగూడకు చెందిన గాందడి చుక్కమ్మ తన భర్తను వదిలి కూతుళ్లతో కలిసి గ్రామంలోనే నివసిస్తోంది. పెద్ద కూతును నగరంలోని మల్లే్‌ష అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆ ఇద్దరికి కొత్తగూడ గ్రామంలో స్థిరపడేలా ఉపాధి కల్పించిన చుక్కమ్మ.. చిన్న కూతురు స్వప్నను 12 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన కంచకుంట్ల పరమే్‌ష(37)తో వివాహం జరిపించింది. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు పుట్టినప్పటి నుంచి పరమేష్‌ మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండేవాడు. ఆమెను తరచూ కొట్టేవాడు. ఈక్రమంలో స్వప్న రెండు సంవత్సరాల నుంచి భర్తను వదిలి అమ్మ సుక్కమ్మ వద్ద స్థిరపడింది. ఈ విషయంపై పరమేష్‌ మూడు నెలల క్రితం భార్యపిల్లలను తనతో పంపించడంలేదని కందుకూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలు, భార్యను తనతో పంపాలని అత్త సుక్కమ్మతో విభేదించాడు. దాంతో స్వప్న, చుక్కమ్మలు బుధవారం రాత్రి పరమే్‌షపై దాడి చేసి హత్యచేశారు. మృతదేహాన్ని చుక్కమ్మ ఇంటికి 50మీటర్ల దూరంలో పడేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు సీఐ సీతారాంలు క్లుస్‌టీమ్‌ను రప్పించారు. విచారణానంతరం పరమేష్‌ భార్య, అత్తలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. పరమేష్‌ను హత్య చేసింది కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని చుక్కమ్మ బంధువులైన లక్ష్మయ్య, లలితలు ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 08:31 AM