మాజీ ప్రధాని మృతి పట్ల ఘన నివాళి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:51 PM
ఆధునిక భారత ఆర్థిక రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం మన్మోహన్ సింగ్ మృతిపట్ల కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, నాయకులతో కలిసి నివాళులర్పించారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు.

కడ్తాల్/ఆమనగల్లు/యాచారం/మంచాల/షాబాద్/ఆదిభట్ల/షాద్‌నగర్/కొత్తూర్/కందుకూరు/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల/శంషాబాద్/కేశంపేట/శంషాబాద్ రూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆధునిక భారత ఆర్థిక రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం మన్మోహన్ సింగ్ మృతిపట్ల కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, నాయకులతో కలిసి నివాళులర్పించారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు. ఆమనగల్లు మండలం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, జగన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం ఏఎంసీ డైరెక్టర్, కాంగ్రెస్ యాచారం మండలాధ్యక్షుడు నర్సింహ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి ఏఎంసీ డైరెక్టర్ ఎండీ అక్బర్, భట్టు శ్రీనివాస్, వెంకటరెడ్డిలతో కలిసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి మంచాలలో మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. జాపాలలో ఆవుల మల్లేష్, మంచాలలో విష్ణువర్ధన్‌రెడ్డి, సాతిరి ఎల్లేష్, ఆనంగళ్లయాదయ్య, తదితరులు నివాళులర్పించారు. కాంగ్రెస్ యువ నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో నివాళులర్పించారు. చైర్‌పర్సన్ స్రవంతి, వైస్‌చైర్మన్ మంగ, గడ్డిఅన్నారం, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్లు మధుసూదన్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, తదితరులున్నారు. మన్మోహన్ చిత్రపటానికి ఆదిభట్ల మున్సిపాలిటీలోని బొంగ్లూర్ చౌరస్తా, ఎంపీపటేల్‌గూడలో నాయకులు నివాళులర్పించారు. వైస్ చైర్మన్ యాదగిరి తదితరులన్నారు. ఎంపీపటేల్‌గూడ మాజీ సర్పంచ్ భాస్కర్‌గౌడ్, ఉపసర్పంచ్ అశోక్‌రెడ్డి, తదితరులున్నారు. కాంగ్రెస్ షాబాద్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీలు రవీందర్, చెన్నయ్య, అశోక్, తదితరులున్నారు. కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి చేవెళ్ల మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పీసీసీ సహాయ కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్, ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, తదితరులున్నారు. కాంగ్రెస్ కొత్తూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. హరినాథ్‌రెడ్డి, జనార్దన్‌చారి, సురేందర్, శివశంకర్, చిల్కమర్రి నర్సింహ, తదితరులున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్‌నగర్ పట్టణ కూడలిలో మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. చెల్లా శ్రీకాంత్‌రెడ్డి, రఘు, బాబర్‌ఖాన్, అగ్గనూరు విశ్వం, తదితరులున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మన్మోహన్‌సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కందుకూరు మాజీ జడ్పీటీసీలు జంగారెడ్డి, జంగారెడ్డిలు మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్‌పై మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల శాఖ అధ్యక్షుడు కృష్ణానాయక్, నాయకులున్నారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో మన్మోహన్‌సింగ్ మృతికి సంతాప సూచకంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జ్ఞానేశ్వర్, జె.నరేందర్, పాల్గొన్నారు. మన్మోహన్ సేవలు చిరస్మరణీయమని కేశంపేట మండలాధ్యక్షుడు వీరేశ్ అన్నారు. మండల కేంద్రంలో చిత్రపటానికి నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, రాములు, సురేష్ మాదిగ, ఆనంద్ రెడ్డి, పెంటయ్య, తదితరులున్నారు. శంషాబాద్ మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గడ్డం శేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్‌లు నివాళులర్పించారు. కౌన్సిలర్లు శ్రీకాంత్‌యాదవ్, తాజ్‌బాబా, శేఖర్, నర్సింగ్‌రావు, నజీర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.