Share News

రేషన్‌ డీలర్ల సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:02 AM

రేషన్‌డీలర్ల సమస్యలను పరిష్కరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. మండలంలో పలు పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రేషన్‌డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సువర్ణలక్ష్మినారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు రేషన్‌డీలర్లు వినతిపత్రం అందజేశారు.

 రేషన్‌ డీలర్ల సమస్యలకు పరిష్కారం
మంత్రి శ్రీధర్‌బాబుకు సమస్యలను విన్నవిస్తున్న మండల రేషన్‌డీలర్లు

మంత్రి డి. శ్రీధర్‌బాబు

మహేశ్వరం, ఫిబ్రవరి 19 : రేషన్‌డీలర్ల సమస్యలను పరిష్కరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. మండలంలో పలు పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రేషన్‌డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సువర్ణలక్ష్మినారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు రేషన్‌డీలర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రేషన్‌ డీలర్ల సమస్యలను ఏరోజూ పట్టించుకోలేదని, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి గతంలో మాదిరిగా తొమ్మిది రకాల ప్రజావసరాల వస్తువులను పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రేషన్‌ డీలర్లు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, విజయ్‌సూర్య, కృష్ణగౌడ్‌, శివయాదవ్‌, బాబు, దినాకర్‌ ఉన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది

కందుకూరు : రంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మహేశ్వరం మండల ం తుక్కుఉగూడ మున్సిపాలిటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి వచ్చిన ఆయనను పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, దెబ్బగూడ మాజీ సర్పంచ్‌ ఏనుగు శ్రావణిలు కలిసి ఈ ప్రాంత సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమయ్యిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నట్లు గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దేప భాస్కర్‌రెడ్డి, కృష్ణానాయక్‌, అందుగుల సత్యనారాయణ, రాకే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:02 AM