నాగర్ కర్నూల్ జిల్లాలో షాద్‌నగర్ వాసి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:03 AM
షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన దొడ్డి యాదగిరి(38) నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పొలిశెట్టిపల్లి గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

షాద్‌నగర్ రూరల్, జూలై 7: షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన దొడ్డి యాదగిరి(38) నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పొలిశెట్టిపల్లి గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గురువారం ఇంటి నుంచి బంధువుల గ్రామమైన పొలిశెట్టిపల్లిలో ఉండే బావ ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు అక్కడి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి మొబైల్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈక్రమంలో ఆదివారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
120 కిలోల నల్లబెల్లం స్వాధీనం
కారు బోల్తా పడటంతో పట్టుబడిన వైనం.. డ్రైవర్ పరారీ
యాచారం, జూలై 7 : అక్రమంగా నల్లబెల్లం తరలిస్తుండగా.. పోలీసులను చూసి కంగారుగా కారు నడపడంతో బోల్తాపడింది. అయితే, ఆ కారులో 120 కిలోల నల్లబెల్లం లభ్యమైంది. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్‌లో ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ఏపీ 39జెపీ 8342 నెంబర్ గల బ్రిజా కారు హైదరాబాద్ నుంచి వస్తుండగా.. మాల్‌లో పెట్రోలింగ్ పోలీసులను చూసి డ్రైవర్ అతివేగంగా ముందుకెళ్లాడు. దాంతో కారు బోల్తా పడింది. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెళ్లి చూసేసరికి కారులో 120 కిలోల బెల్లం లభ్యమైంది. పోలీసులు బోల్తాపడిన కారును అతి కష్టం మీద యఽథాస్థితికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.