Share News

అ‘పూర్వ’ సమ్మేళనం

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:50 PM

స్థానిక విద్యాభారతి స్కూల్‌ 2001-02 10వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేరారు. దుర్గా గ్రాండ్‌ హోటల్‌ అందుకు వేదికైంది.

అ‘పూర్వ’ సమ్మేళనం
22ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు

తాండూరు జనవరి 12: స్థానిక విద్యాభారతి స్కూల్‌ 2001-02 10వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేరారు. దుర్గా గ్రాండ్‌ హోటల్‌ అందుకు వేదికైంది. విద్యార్థులు తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులకు పాదపూజలు చేసి జ్ఞాపికలను అందజేసి పూలతో ఘనంగా సన్మానించారు. సుమారు 22సంవత్సరాలు తర్వాత ఉపాధ్యాయులు మిత్రబృందం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి స్కూల్‌ హెచ్‌ఎం ప్రభు లింగం, నారాయణగౌడ్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, ఉదయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:50 PM