Share News

నిబంధనలకు విరుద్ధంగా గోలీసోడా తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:21 AM

గడువు ముగిసిన ముడిసరుకుతో నిబంధనలకు విరుద్ధంగా గోలీసోడా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా గోలీసోడా తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 29: గడువు ముగిసిన ముడిసరుకుతో నిబంధనలకు విరుద్ధంగా గోలీసోడా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ చందుపట్లగూడకు చెందిన సల్ల సాయితేజ, ఎదులాబాద్‌లో కిరాణా దుకాణంను నిర్వహిస్తున్నాడు. అందులో ఆహారభద్రత పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా గోలీ సోడా తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకొని సోమవారం దాడి సోదాలు నిర్వహించారు. గోలీసోడాలో కలిపేందుకు గడువు ముగిసిన ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించకుండా, నిబంధనలకు విరుద్దంగా గోలీసోడా తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సాయితేజను అరెస్టుచేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 12:21 AM