చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:17 AM
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు శామీర్‌పేట్ పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మూడుచింతలపల్లి, జూలై 4: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు శామీర్‌పేట్ పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ధర్‌మేందర్(27), శేఖర్(40), ప్రశాంత్(29), గణేష్ (28), మహేశ్ (25), సంజీవ(30)లు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ముఠాగా ఏర్పడి చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి సిద్దిపేట్‌కు వెళ్లే పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేస్తూ శామీర్‌పేట్ మండలంలో బస్సు దిగారు. ముఠాసభ్యులు ఇద్దరిద్దరుగా విడిపోయి శామీర్‌పేట్‌లో తిరుగుతూ ఒక స్ర్కాప్ దుకాణంలో చొరబడి తాళం పగలగొట్టి రూంలో ఉన్న వాహనం తాళాలను తీసుకుని ఏపీ 01 టీఏ 0413 నంబరు గల బొలెరో వాహనాన్ని ఎత్తుకొళ్లారు. కాగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా బొలెరో, బెలినో కారు వాహనాలకు సంబంధించిన పత్రాలను చూపెట్టకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో తాము బొలెరో వాహనాన్ని దొంగలించినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు శేఖర్‌తో పాటు బొలెరో, బెలినో కారు, ఒక మొబైల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేశారు. మిగతా ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.