అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:06 AM
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దేముల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

పెద్దేముల్, డిసెంబర్ 30(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దేముల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన దేవుజా(55)తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం తాను ఒక్కడే పనిమీద గిర్మాపూర్ గ్రామానికి వచ్చాడు. సోమవారం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసునమోదు చేసుకుని విచారణ చేపడతామని ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి..
మేడ్చల్ టౌన్: చికిత్సపొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 26న మేడ్చల్‌లో 30నుంచి 35 వయస్సు గల వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.