రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:35 PM
రోడ్డు ప్రమాదంలో బైకు పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మేడ్చల్ టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో బైకు పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం రావల్‌కోల్ గ్రామానికి చెందిన నాగరాజు(34) గురువారం ఉదయం మండలంలోని రాజబొల్లారం గ్రామ సమీపంలో తను పని చేసే మోనార్క్ పరిశ్రమకు బైక్ పై బయలు దేరాడు. పూడూరు గ్రామ సమీపంలో బైకు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమితం గాంధీ మార్చురీకి తరలించారు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.