Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:47 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బొంరాస్‌పేట్‌ మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బొంరాస్‌పేట్‌, ఫిబ్రవరి 15: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బొంరాస్‌పేట్‌ మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని మహంతీపూర్‌ గ్రామానికి చెందిన అచ్చమొల్ల చిన్నయ్య అలియాస్‌ చంద్రయ్య పనినిమిత్తం బొంరాస్‌పేట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణంలో బైక్‌పై సొంత గ్రామానికి వెళ్తుండగా బొట్లవనితండా సమీపంలో 163వ జాతీయ రహదారిలో మినీవ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మరొకరు..

ఘట్‌కేసర్‌ రూరల్‌: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతున్న ఓవ్యక్తి గురువారం మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోవర్దనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మున్సిపాలిటీ రాంపల్లికి చెందిన డప్పు ప్రశాంత్‌(32) తన సోదరుడు డప్పు శ్రీకాంత్‌తో కలిసి బైక్‌పై ఈనెల 13వ తేదీన ఘట్‌కేసర్‌ వెళ్లారు. పనులు ముగించుకోని తిరిగి ఇంటికి వస్తుండగా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం సమీపంలోకి రాగానే బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌ తలకు బలమైన గాయమైంది. అతడి కడుపులో పేగులు బయటకు వచ్చాయి. శ్రీకాంత్‌కు సైతం తీవ్రగాయాలు కావడంతో 108 సిబ్బంది ప్రథమ చిక్సిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్‌ గురువారం మృతిచెందినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా, ఆజాగ్రత్తగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 11:47 PM