బైక్ అదుపుతప్పి పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 29 , 2024 | 12:28 AM
బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని జాలపల్లి గ్రామసమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది., ఎస్సై శ్రీకాంత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
తలకొండపల్లి, జూలై 28 : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని జాలపల్లి గ్రామసమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది., ఎస్సై శ్రీకాంత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశంపేట మండలం కాకునూర్‌కు చెందిన గంగోజి బ్రహ్మచారి(50) తన బావమరిది మణికంఠతో కలిసి బైక్‌పై మిడ్జిల్ మండల కేంద్రానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జూలపల్లి మీదుగా కాకునూర్‌కు వెళుతుండగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తగాయాలైన బ్రహ్మచారిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.