Share News

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:59 PM

కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బర్వాద్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

బంట్వారం (కోట్‌పల్లి) ఏప్రిల్‌ 28: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బర్వాద్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బర్వాద్‌ గ్రామానికి చెందిన పెద్దోళ్ల నర్సింహులు(46)కు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజుల కిందట నర్సింహులు బైక్‌పై మోమిన్‌పేటకు వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి పడటంతో అయనకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత కుటుంబ కలహాలతో నర్సింహులు భార్య లలిత గొడవపడి ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కోట్‌పల్లి ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆమె తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 11:59 PM