Share News

స్కూటీని ఢీకొన్న లారీ.. విద్యార్థినికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:24 PM

లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

స్కూటీని ఢీకొన్న లారీ.. విద్యార్థినికి తీవ్రగాయాలు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 1: లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బి.రాజువర్మ కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్‌, రాంపల్లికి చెందిన పతంగీ హర్షిత(20) పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి యంనంపేట్‌ శ్రీనిధి ఇంజనీరింగు కళాశాలలో ఈసీఈ సెకండియర్‌ చదువుతోంది. గురువారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్ష రాసి స్కూటీపై తిరిగి ఇంటికి వెళ్తుతుండగా, యంనంపేట్‌ సమీపంలో ఘట్‌కేసర్‌ నుంచి రాంపల్లి వైపునకు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ ఒకవైపు దూరంగా పడగా హర్షిత కాళ్లపై నుంచి లారీ వెళ్ళింది. ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హర్షితను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డైవ్రర్‌ను అదుపులోకి తీసుకొని, లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హర్షిత తండ్రి పతంగీ వెంకట సుబ్బారావు రైల్వే ఉద్యోగి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 11:24 PM