Share News

మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:11 AM

అతివేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న మోపెడ్‌( టీవీఎస్‌ ఎక్సెల్‌)ను ఢీకొనడంతో ఇద్దరు వృద్ధుల కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

చేవెళ్ల, ఏప్రిల్‌ 2 : అతివేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న మోపెడ్‌( టీవీఎస్‌ ఎక్సెల్‌)ను ఢీకొనడంతో ఇద్దరు వృద్ధుల కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌ మండలం ఎర్రోనిగూడకు చెందిన మకుటం నర్సింలు, సోమయ్య ఇద్దరూ గ్రామాల్లో తిరు గుతూ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి బుర్రకథ చెప్పేందుకు వెళ్లి మోపెడ్‌పై మంగళవారం ఉదయం సొంతూరు వెళ్తుండగా అల్లావాడ స్టేజీ సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఇద్దరి కాళ్లపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో కాళ్లు నుజ్జనుజ్జయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:11 AM