Share News

యాచారంలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:19 AM

మండలంలో లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్‌ కె.జోగిరెడ్డిలతో పాటు దాదాపు రెండు వందల మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నగరంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిల సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

యాచారంలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి పుష్ఫగుచ్ఛం అందజేస్త్ను చంద్రశేఖర్‌రెడ్డి

భారీగా కాంగ్రె్‌సలో చేరిన నాయకులు

యాచారం, ఏప్రిల్‌ 16 : మండలంలో లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్‌ కె.జోగిరెడ్డిలతో పాటు దాదాపు రెండు వందల మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నగరంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిల సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యే మల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి పరిచయం చేశారు. ఎంపీ ఎన్నికల ముందు ముఖ్యనాయకులు కాంగ్రె్‌సలో చేరడంతో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలినట్లయింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థికి కనీసం 40 వేల మోజార్టీ ఇవ్వడం ఖాయమన్నారు. బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో దళితబంధు అర్హులకు అందలేదని, గ్రామాల ప్రగతి కుంటు పడిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు ముత్యాల వెంకట రెడ్డి, కొత్తకుర్మ సత్తయ్య, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మస్కు నర్సింహ తదితరులున్నారు. కాగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధికి అధికంగా నిధులిచ్చి ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపినట్లు నాయకులు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో భారీ మోజార్టీ సాధంచడంపై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 12:19 AM