Share News

ఘనంగా కళాశాల వార్షికోత్సవం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:39 PM

కేశవరం తండాలో ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర కళాశాల 23వ వార్షికోత్సవాన్ని ఆదివారం కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది.

ఘనంగా కళాశాల వార్షికోత్సవం
విద్యార్థినుల నృత్య ప్రదర్శన

మూడుచింతలపల్లి, జనవరి 28: కేశవరం తండాలో ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర కళాశాల 23వ వార్షికోత్సవాన్ని ఆదివారం కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు కామిడి వీరారెడ్డి విగ్రహానికి చైర్మన్‌ కామిడి మధుసూదన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే భావనతో కళాశాలను వీరారెడ్డి స్థాపించారని గుర్తు చేశారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ఫీజుల ఒత్తిడి లేకుండా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన జరుగుతోందని, నిరుపేదలైన విద్యార్థులకు విద్యను అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కళాశాలకు పలువురు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల మాజీ చైర్మన్‌ రాంరెడ్డి, కోశాధికారి నాగభూషణం, ఉపాధ్యాక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజయ్యగుప్త, సహాయ కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీలు హన్మంతరెడ్డి, నాగరాజు, సర్పంచ్‌ రవి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:39 PM