Share News

వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:21 AM

వీధికుక్కల దాడిలో 18నెలల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోఎని అద్రా్‌సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.

వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

మూడుచింతలపల్లి, మార్చి 17: వీధికుక్కల దాడిలో 18నెలల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోఎని అద్రా్‌సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్‌ కూతురు రష్మిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడికి చేశాయి. పాపను చుట్టిముట్టి ముఖం, ఇతర శరీర భాగాలపై కరిచాయి. గమనించిన స్థానికులు, కుటుంబీకులు కుక్కలను చెదరగొట్టారు. పాపను చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Mar 18 , 2024 | 12:21 AM