Share News

రిసార్ట్‌ నిర్వాహకులపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:02 AM

నిబంధనలకు విరుద్దంగా డీజే సౌండ్‌ ఏర్పాటు చేసిన ఓ రీసార్ట్‌పై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

రిసార్ట్‌ నిర్వాహకులపై కేసు నమోదు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 26: నిబంధనలకు విరుద్దంగా డీజే సౌండ్‌ ఏర్పాటు చేసిన ఓ రీసార్ట్‌పై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్‌లోని విలేజ్‌ ట్రయల్స్‌ రీసార్ట్‌ నిర్వాహకులు హోలీ పండుగ సందర్భంగా డీజే ఏర్పాటు చేసుకునేందుకు పోలీసుల అనుమతి కోరారు. అయితే పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ రీసార్ట్‌ నిర్వాహకులు డీజేతో పాటు లౌడ్‌ స్పీకర్స్‌, బ్యాండ్‌లతో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ మేరకు ఈవెంట్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:02 AM