Share News

పేకాడుతున్న ఆరుగురిపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:14 AM

పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

పేకాడుతున్న ఆరుగురిపై కేసు నమోదు

తాండూరు రూరల్‌, మార్చి 7: పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గౌతాపూర్‌ శివారులో గురువారం పేకాడుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఎస్‌ఐ తన సిబ్బంది అశోక్‌, ధన్‌రాజ్‌తో కలిసి గౌతాపూర్‌ శివారులో పరిశీలించారు. అక్కడ ఆరుగురు వ్యక్తులు షేక్‌రబ్బాని, ఈడిగి అశోక్‌, షఫీయొద్దీన్‌, షేక్‌ ముర్తాజా, ప్రేమ్‌కుమార్‌, ఎండి.సలీం పేకాడుతుండగా పట్టుకున్నారు. వారి నుంచి పేక ముక్కలతో పాటు రూ.8060 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 12:15 AM