Share News

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:27 AM

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

యాలాల, జూన్‌ 11: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. ఆ యన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)తో అదేగ్రామానికి చెందిన సాయిలు(32) అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఈనెల 9వ తేదీన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వివరించారు.

Updated Date - Jun 12 , 2024 | 08:25 AM