Share News

బైక్‌ను ఢీన్న కారు.. ఒకరు మృతి

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:16 AM

బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బైక్‌ను ఢీన్న కారు.. ఒకరు మృతి

పూడూరు, ఏప్రిల్‌ 3 : బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలంలోని కుత్భుల్లాపూర్‌ గ్రామానికి చెందిన జోగు పాండు(34) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం లక్ష్మి అనే మహిళను మన్నెగూడలో వదిలిపెట్టేందుకు బైక్‌పై వెళుతున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలో చీలాపూర్‌ గేటు వద్ద అతివేగంగా వస్తున్న కారు (ఎక్స్‌వీయూ400) బైక్‌ను ఢీకొట్టింది. దాంతో పాండు, లక్ష్మి తల, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు పరిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే పాండు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 12:16 AM