Share News

కారును ఢీకొన్న బైక్‌.. ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:35 PM

కారును ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్‌పై వెళ్తుతున్న ఇద్దరు వ ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది.

కారును ఢీకొన్న బైక్‌.. ఇద్దరికి గాయాలు

పూడూరు, జనవరి 1: కారును ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్‌పై వెళ్తుతున్న ఇద్దరు వ ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మన్నెగూడ సమీపంలో వికారాబాద్‌ నుంచి మన్నెగూడ వైపు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. ఇదే సమయంలో ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి ముందు బస్సు ఎదురైంది. బస్సును తప్పించే క్రమంలో కారును వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:35 PM