Share News

రెండోరోజు 8 నామినేషన్లు దాఖలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:15 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాలకు రెండో రోజు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చేశారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి శుక్రవారం 5 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు.

రెండోరోజు 8 నామినేషన్లు దాఖలు
ఎంసీపీఐ(యు) పార్టీ బీఎల్‌ఎఫ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థి వనం సుధాకర్‌

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌/రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 19 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాలకు రెండో రోజు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చేశారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి శుక్రవారం 5 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా ఓరుగంటి వెంకటేశ్వర్లు, పెండ్యాల సాయి వరప్రసాద్‌, రాజేష్‌ మిశ్రా శివ్‌, చలిక చంద్రశేఖర్‌ లు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు చేయగా, కుడుపూడి వీవీఎస్‌ నారాయణ రెండు సెట్లు నామినే షన్లు దాఖలు చేశారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బీఎల్‌ఎఫ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యు) పార్టీ అభ్యర్థి వనం సుధాకర్‌, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ చాంద్‌పాషా, భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ తరపున ప్రతిపాదకులు మేకల బిక్షపతి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ పత్రాలను జిల్లా రిటర్నింగ్‌ అధికారి శశాంకకు సమర్పించారు. కాగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మరో దఫాలో ఈనెల 22న రెండో సెట్‌ నామినేషన్‌ వేయనున్నారు. అలాగే ఈనెల 25న పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు ర్యాలీతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో రెండు సెట్ల నామినేషన్‌ వేసేందుకు కాసాని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 12:15 AM