Share News

చేవెళ్ల నియోజకవర్గంలో 71.83శాతం పోలింగ్‌

ABN , Publish Date - May 15 , 2024 | 12:00 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో పోలింగ్‌ బాగానే నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 71.83శాతం ఓట్లు పోలైనట్టు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం పేర్కొన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో 71.83శాతం పోలింగ్‌
షాబాద్‌ మండలంలో ఓటు వేస్తున్న ఓటర్లు(ఫైల్‌)

చేవెళ్ల, మే 14: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో పోలింగ్‌ బాగానే నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 71.83శాతం ఓట్లు పోలైనట్టు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం పేర్కొన్నారు. నియోజకవర్గం లో 2,69,960మంది ఓటర్లకు 1,93,911ఓట్లు పోలై నట్టు తెలిపారు. చేవెళ్ల 58,594మంది ఓటర్లకు 72.51శాతం మంది ఓటేశారన్నారు. శంకర్‌పల్లి మండలంలో 66,172 ఓటర్లకు 72.1శాతం, నవాబ్‌పేట మండలంలో 36,942 మంది ఓటర్లకు 71.52 శాతం, మొయినాబాద్‌లో 61,048 మంది ఓటర్లకు 72.08శాతం, షాబాద్‌ మండలంలో 47,204మంది మంది ఓటర్లకు 70.52శాతం మంది ఓటేసినట్టు వివరించారు. అయితే నియోజకరవ్గంలోనే చేవెళ్ల మండలంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చేవెళ్లలో లోక్‌సభ ఎన్నికల్లో 2.3శాతం పోలింగ్‌ త గ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో74.13, లోక్‌సభ ఎన్నికల్లో 71.83శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

Updated Date - May 15 , 2024 | 12:00 AM