Share News

60 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:24 AM

వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని అతడి వద్ద నుంచి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రైల్వే సీఐ వెంకటరత్నం తెలిపారు.

60 కిలోల గంజాయి పట్టివేత
వివరాలు వెల్లడిస్తున్న రైల్వే సీఐ

వికారాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని అతడి వద్ద నుంచి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రైల్వే సీఐ వెంకటరత్నం తెలిపారు. రైల్వేపోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్‌లో సాధారణ తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్దనున్న ఆరు బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఇద్దరిలో ఒకరు పారిపోగా ఒడిస్సాకు చెందిన సంజీత్‌ కుమార్‌ భుయాన్‌గా గుర్తించామని చెప్పారు. వారి వద్దనున్న 60కిలోలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు గతంలోనూ గంజాయి కేసులో పట్టుబడ్డాడినట్లు రికార్డులో ఉందని తెలిపారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 12:24 AM