‘చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:31 PM
చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి వెంటనే అమలు చేయాలని యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ కోరారు.
ఆమనగల్లు, ఫిబ్రవరి 6: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి వెంటనే అమలు చేయాలని యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ కోరారు. కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో బీసీల వాటా తేల్చాలని కోరారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన మహాధర్నాలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన రాఘవేందర్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి, ఎంపీ మస్తాన్‌రావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీల వెంకటేశ్, జాతీయ బీసీ రక్షదళ్ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, మహిళా నాయకురాలు రజిత, వాణి, అరవింద్, స్వామి, లింగంయాదవ్, రాజేందర్‌లతో కలిసి ధర్నాలో పాల్గొన్నట్లు తెలిపారు.