Share News

ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌లో దీపక్‌కు 3 స్వర్ణాలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:03 AM

ఆసియా ఓపెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన పి.మోహ్నిష్‌ దీపక్‌ మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు.

ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌లో దీపక్‌కు 3 స్వర్ణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఓపెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన పి.మోహ్నిష్‌ దీపక్‌ మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కిర్గిస్థాన్‌లో జరిగిన ఈ పోటీల్లో దీపక్‌ మొత్తంగా 557.5 కిలోల బరువెత్తి సంచలనం సృష్టించాడు. స్క్వాట్‌లో 222.5 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌లో 125కిలోలు, డెడ్‌లి్‌ఫ్టలో 225 కిలోల బరువెత్తి, మూడు పసిడి పతకాలు సాధించాడు. దీపక్‌ను డబ్ల్యూపీసీ తెలంగాణ పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఇంటూరి రేఖ అభినందించారు.

Updated Date - Mar 12 , 2024 | 12:03 AM