వీధి కుక్కల దాడిలో 15గొర్రెలు మృతి
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:46 PM
వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అప్పోజిగూడ గ్రామంలో చోటుచేసుకుంది
మొయినాబాద్ రూరల్, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అప్పోజిగూడ గ్రామంలో చోటుచేసుకుంది గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్లగూడెం పెంటయ్య తనకున్న గొర్రెలను ఎప్పటిలాగే తన మందలో వదిలివేశాడు. శనివారం అర్ధరాత్రి గ్రామంలోని వీధి కుక్కలు గొర్రెల మందపై దాడిచేయడంతో దాదాపు 15 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెలను సాకి ఉపాధి పొందుతున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని పెంటయ్య వేడుకున్నాడు.