Share News

Actress Hema: రేవ్‌పార్టీ వివాదంలో నటి హేమకు నోటీసులు

ABN , Publish Date - May 26 , 2024 | 06:12 AM

బెంగళూరు ఫాం హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులు.. తెలుగు నటి హేమకు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్‌ పార్టీ వ్యవహారం బయటపడిన వెంటనే హేమ ఓ వీడియో విడుదల చేశారు.

Actress Hema: రేవ్‌పార్టీ వివాదంలో నటి హేమకు నోటీసులు

బెంగళూరు, మే 25(ఆంధ్రజ్యోతి): బెంగళూరు ఫాం హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులు.. తెలుగు నటి హేమకు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్‌ పార్టీ వ్యవహారం బయటపడిన వెంటనే హేమ ఓ వీడియో విడుదల చేశారు. తాను హైదరాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో ఉన్నానని, తనపై తప్పుడు కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కానీ ఆమె రేవ్‌ పార్టీలో ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఆమె నుంచి సేకరించిన రక్తపు నమూనాలలో డ్రగ్స్‌ వాడినట్లు తేలిందని తాజాగా ప్రకటించారు. పార్టీలో పాల్గొన్న 103 మంది నుంచి రక్తపు నమూనాలు సేకరించగా.. 86 మంది డ్రగ్స్‌ వాడినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 06:12 AM