Share News

Nampally Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హైదరాబాద్‌లో తొలిసారి ఉరిశిక్ష

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:31 PM

హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో కట్నం కోసం భార్యను అతి దారుణంగా హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్‌ చరిత్రలో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఆ వివరాల్లోకి వెళ్తే.. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇమ్రాన్ ఉల్ హక్‌కు ఒక మహిళతో వివాహం అయ్యింది.

Nampally Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హైదరాబాద్‌లో తొలిసారి ఉరిశిక్ష

హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో కట్నం కోసం భార్యను అతి దారుణంగా హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్‌ చరిత్రలో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఆ వివరాల్లోకి వెళ్తే.. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇమ్రాన్ ఉల్ హక్‌కు ఒక మహిళతో వివాహం అయ్యింది. అమ్మాయి తరఫు వారు అతనికి భారీ కట్నమే సమర్పించుకున్నారు. అతడు అడిగిన వస్తువులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. అతడు అదనపు వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. కట్నం తీసుకొస్తావా? చంపేయాలా? అంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు.


ఈ క్రమంలోనే 2018లో ఇమ్రాన్ మరోసారి కట్నం కోసం తన భార్యతో గొడవకు దిగాడు. భార్య తనకు ఎదురుతిరగడంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఇమ్రాన్.. ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారాలతో సహా కోర్టులో అతడ్ని హాజరుపరిచారు. ఈ కేసుని విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు.. పోలీసుల సేకరించిన ఆధారాలతో ఏకీభవిస్తూ నిందితుడికి మరణశిక్ష విధించింది. అంతేకాదు.. రూ.10 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. ఒకవేళ జరిమాన చెల్లింకపోతే.. 5 నెలల సాధారణ జైలు శిక్షను ప్రకటించింది. భాగ్యనగర చరిత్రలో ఓ వ్యక్తికి తొలిసారి ఉరిశిక్ష విధించడంతో.. ఇది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 18 , 2024 | 10:31 PM