Share News

కార్గో సేవలతో యువతకు ఉపాధి: బడుగుల

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:34 PM

కార్గో సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

కార్గో సేవలతో యువతకు ఉపాధి: బడుగుల
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌

మాడ్గులపల్లి, మార్చి 12: కార్గో సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా మంగళవారం మండలంలోని కొత్తగూడెం గ్రామం వద్ద ఎఫ్‌సీఐ గోదాంలో కార్గో సేవలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం గ్రామంలో ఎంపీ లింగయ్యయాదవ్‌ పాల్గొని మాట్లాడుతూ కార్గో సేవలతో హమాలీకి తక్కువ సమయంలోనే పనులు పూర్తవుతాయన్నారు. గోదాంలు ఉన్న ప్రతీచోట కార్గో సేవలను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. రైల్వేశాఖ ఎఫ్‌సీఐలను అభివృద్ధి చేయాలని ఆయన సూచిం చారు. కార్యక్రమంలో వల్లపురెడ్డి కోటిరెడ్డి, సిరిగిరెడ్డి రాంరెడ్డి, జిల్లా శ్రీనివా్‌సరెడ్డి, పసునూరి ప్రహ్లాద్‌, సుశీల్‌కుమార్‌, సుధాకర్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:34 PM