Share News

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 23 , 2024 | 11:52 PM

పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు.

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌

భువనగిరి రూరల్‌, మార్చి 23: పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి కనీస వేతన జీవోలను విడుదల చేయకపోవడం సరికాదన్నారు. నూతన కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికశాఖలో నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఆ నోటిఫికేషన్లలో కా ర్మికులకు కనీస వేతనం రూ.11వేలకు పరిమితం చేస్తూ విడుదల చేసిందన్నారు. దీనిపై మార్చి 31 వరకు కార్మికుల అభ్యంతరాలను తెలియజేయాలని కార్మిక శాఖను కోరిందన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26,000 తగ్గకుండా నిర్ణయించాలన్నారు. అదేవిధంగా భగత్‌ సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించా రు. సమావేశంలో సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, మల్లేశం, ఎండీ పాషా, మాయ కృష్ణ, గోడ భాగ్య, సత్యనారాయణ,నందీశ్వర్‌, జహంగీర్‌,గణపతిరెడ్డి, యాదమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2024 | 11:52 PM