Share News

నెలాఖరుతో అవిశ్వాసానికి తెర

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:28 AM

భువనగిరి మునిసిపల్‌ 60 రోజుల అవిశ్వాస రాజకీయాలకు ఈ నెల 28తో తెరపడనుంది. అనుకోని పరిస్థితులు తలెత్తితే మాత్రం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలుంటాయి. దీంతో నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లు ఎవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

నెలాఖరుతో అవిశ్వాసానికి తెర

60 రోజుల్లో జోరుగా సాగిన భువనగిరి మునిసిపల్‌ రాజకీయం

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల కోసం పోటాపోటీ

క్యాంప్‌లలోనే కౌన్సిలర్లు

ప్రత్యేక అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జయశ్రీ

నోటీసులను అందజేసిన అధికారులు

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 25: భువనగిరి మునిసిపల్‌ 60 రోజుల అవిశ్వాస రాజకీయాలకు ఈ నెల 28తో తెరపడనుంది. అనుకోని పరిస్థితులు తలెత్తితే మాత్రం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలుంటాయి. దీంతో నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లు ఎవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన గత చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్యపై 35మంది కౌన్సిలర్లు గత డిసెంబరు 30న ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. జనవరి 23న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వారిద్దరూ పదవిని కోల్పోయారు. నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకోసం ఈ నెల 28వ తేదీన ప్రత్యేక సమావేశం జరగనుంది. సమావేశం ప్రత్యేక అధికారిగా స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ బి.జయశ్రీని కలెక్టర్‌ హనుమంత్‌ కే.జెండగే నియమించారు. మునిసిపల్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు 35 మంది కౌన్సిలర్లకు మునిసిపల్‌ సిబ్బంది ప్రత్యేక సమావేశం నోటీసులను అందజేశారు. అందుబాటులో ఉన్న కౌన్సిలర్లకు నేరుగా నోటీసులను అందజేయగా, శిబిరాల్లోని కౌన్సిలర్లకు సంబంధించిన నోటీసులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ కోసం పోటాపోటీ

10 నెలలు మాత్రమే పదవుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల కోసం అన్ని పార్టీల్లోనూ పోటాపోటీ నెలకొన్నది. బీఆర్‌ఎస్‌ మునిసిపల్‌పై పట్టును కోల్పోగా, అం ది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్‌ శక్తియుక్తులను ఒడ్డుతోంది. బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలను సాగిస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ బహిరంగంగానే రెండు వర్గాలుగా విడిపోగా కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం పార్టీ పరిధిలోనే ఆశావహులు, తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పలువురు సభ్యులు పలు కారణాలతో జంప్‌ జిలానీలుగా మారారు. దీంతో 35మంది సభ్యులు గల మునిసిపాలిటీలో ప్రస్తుతం ఏపార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో స్పష్టత కొరవడిన తీరు మునిసిపల్‌ కప్పగం తు రాజకీయాలను స్పష్టం చేస్తోంది. మునిసిపాలిటీలో పరిధిలోని ప్రజల బాగోగులను పర్యవేక్షించాల్సిన బాఽధ్యతను మునిసిపల్‌ సభ్యులందరూ విస్మరించారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటికే మెజార్టీ సభ్యులు వేర్వేరు క్యాంప్‌లలో ఉండడం గమనార్హం.

28న ప్రత్యేక సమావేశం

నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకోసం ఈ నెల 28వ తేదీన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనుం ది. 35మంది కౌన్సిలర్లుండగా ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ప్రత్యేక సమావేశానికి 19మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. కోరం ఉంటే నే సమావేశం జరుగుతుంది. చేతులెత్తే విధానంలో జరిగే ప్రత్యేక సమావేశంలో అత్యఽధిక సభ్యుల మద్దతు లభించిన వారిని అధికారులు విజేతలుగా ప్రకటిస్తారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ కూడా నిబంధనల మేరకు భువనగిరి మునిసిపల్‌ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నమోదు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వాస్తవమైతే ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి మునిసిపల్‌ సభ్యులసంఖ్య 37కు చేరినప్పటికీ కోరంగా మా త్రం 19గానే పరిగణించబడుతుంది. 28న ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశం కోరం కోసం అరగంటపాటు అధికారులు ఎదురు చూస్తారు. ఆలోపు కోరం సమకూరితో సమావేశాన్ని కొనసాగించి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికను పూర్తిచేస్తారు. అరగంట వరకు కోరం హాజరు కాకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదావేస్తారు. ఆ సమావేశాన్ని కూడా అంతే సంఖ్యాబలాన్ని కోరంగా పరిగణిస్తారు. అయినప్పటికీ 2వ రోజు కూడా సమావేశం కోరంలేక వాయిదా పడితే కోరంతో నిమిత్తం లేకుండా 3వ సమావేశానికి హాజరయ్యే సభ్యులతోనే చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు.

Updated Date - Feb 26 , 2024 | 12:29 AM