సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడైన వేళ
ABN , Publish Date - Jul 13 , 2024 | 12:40 AM
గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్ స్కూ ల్, కళాశాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తనిఖీ చేశా రు. కళాశాలలోని గ్రౌండ్, తరగతి గదులను పరిశీలించారు.
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్ స్కూ ల్, కళాశాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తనిఖీ చేశా రు. కళాశాలలోని గ్రౌండ్, తరగతి గదులను పరిశీలించారు. అందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ భౌతిక శాస్త్రం బోధిస్తు న్న ఉపాధ్యాయుడు డీ.రవీందర్ నాయక్ భౌతిక శాస్త్రంలోని ఫార్మూలాల గురించి వివరిస్తున్నారు. గమనించిన కలెక్టర్ వెంటనే క్లాస్ రూంలోకి వెళ్లి ఫిజిక్స్‌లోని ఫార్మూలాల గురిం చి వాటిని ఎలా గుర్తుంచుకోవాలో 35 నిమిషాలు కలెక్టర్ వివరించారు. వేగము, తోరణముపై భౌతిక శాస్త్రంలో ఉన్న పాఠ్యంశాలను విద్యార్థులకు వివరించారు అనంతరం కళాశా ల విద్యార్థులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.