చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:23 AM
చేనేత వృత్తిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉపాధిని పెంచుకోవాలని కేంద్ర చేనేత, జౌళీ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గెరిటా అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో 100 శిక్షణాలయాలను శనివారం ప్రారభించింది.

కేంద్ర చేనేత, జౌళీశాఖ సహాయమంత్రి పవిత్ర మార్గెరిటా
45 రోజుల పాటు శిక్షణ
భూదాన్‌పోచంపల్లి, జూలై 27 : చేనేత వృత్తిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉపాధిని పెంచుకోవాలని కేంద్ర చేనేత, జౌళీ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గెరిటా అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో 100 శిక్షణాలయాలను శనివారం ప్రారభించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భూదాన్‌పోచంపల్లి పట్టణంలో డీఎ్‌సఆర్ వీవ్స్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వాహకులు దోర్నాల శేషగిరి, మాస్టర్ ట్రైనర్ బోగ బాలయ్య, ఆటిపాముల మహేందర్‌లతో పాటు శిక్షణ పొందుతున్న కార్మికులనుద్దేశించి మాట్లాడారు. చేనేత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు, ముద్ర రుణాలు, సాంకేతిక పరికరాలను అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణా కేంద్రాల ను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చిక్క కృష్ణ, వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.